ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ‌ర్త్ డే కి స‌ర్ ప్రైజ్..

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 20, 2018, 09:56 AM



యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ తన జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులను ఆనందింపజేయబోతున్నాడన్న అంశం కొద్దిరోజులుగా వినిపిస్తోంది. అయితే దానిపై ఇప్పుడు ప్రభాస్‌ నుంచే స్పష్టత రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. తాజాగా ప్రభాస్‌ సోషల్‌మీడియాలో స్పందిస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. ఈ నెల 23న తన పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేయబోతున్నట్లు వెల్లడిస్తూ….ఆ రోజు కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నానని ప్రభాస్‌ అందులో పేర్కొన్నారు. దాంతో ఆయన ఆశ్చర్యానికి గురిచేయబోయే ఆ న్యూస్‌ ఏంటన్న అంశంపై ప్రేక్షకాభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. తాను నటిస్తున్న సాహో చిత్రం ట్రైలర్‌, లేదా టీజర్‌ను పుట్టినరోజున విడుదల చేస్తారో లేక తన పెళ్లి విషయంపై ఆయన ఓ ప్రకటన చేయబోతున్నారా? అని అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.


ప్రభాస్‌ పెళ్లి గురించి చాలాకాలంగా వదంతులు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వాటిని ఆయన ఖండించారు కూడా. తగిన సమయం వచ్చినపుడు పెళ్లిచేసుకుంటానని…ఆ విషయాన్ని ముందుగానే తెలియజేస్తానని ఆయన కొన్ని సందర్భాలలో వెల్లడించారు కూడా. పెదనాన్న కృష్ణంరాజు కూడా ప్రభాస్‌కు పెళ్లి సంబంధాలు వెతుకుతున్నామని లోగడ చెప్పారు కూడా. తాజాగా పరిశ్రమలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సాహో తర్వాత రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ నటిస్తున్న చిత్రం ఇటీవలై మొదలై, విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ పూర్త్తయిన తర్వాత 2019వ సంవత్సరం మధ్యలో ప్రభాస్‌ పెళ్లి ఉంటుందన్న మాటలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద చర్చోపచర్చ జరుగుతున్న ఈ అంశానికి తెరపడాలంటే 23వ తేదీ వరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com