ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా

cinema |   | Published : Sat, Oct 20, 2018, 11:02 AM



దసరా వేళ దుర్గమ్మ వేడుకలతో పాటు - బతుకమ్మ సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దుర్గమ్మకు దసరా సెలబ్రేషన్ స్పెషల్ అనుకుంటే - నవరాత్రుల్లోనే బతుకమ్మ సంబరాలు సాగుతుంటాయి. దుర్గమ్మ ఏపీ స్పెషల్ అనుకుంటే - బతుకమ్మ తెలంగాణ స్పెషల్. ఈసారి బతుకమ్మ సంబరాలు తెలంగాణ వ్యాప్తంగా - ముఖ్యంగా హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. కొన్ని కాలనీల్లో స్టార్లు అదనపు ఆకర్షణగా నిలిచారు ఈ వేడుకల్లో. ఇక విదేశాల్లో బతుకమ్మ సంబరాల మాటేమిటి?  అందునా అమెరికా లాంటి చోట తెలుగువాళ్లు ఉన్న ఇలాకాలో బతుకమ్మ సంబరాలు ఎలా జరిగాయి? అంటే .. ఓ రేంజులో కుమ్మేశారన్నది తాజా అప్ డేట్.


అమెరికా- డల్లాస్ లో జరిగిన బతుకమ్మ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి స్పెషల్ గెస్టులు అటెండ్ అయ్యారు. ఈ ఉత్సవాల్లో దాదాపు 2000 మంది పార్టిసిపెంట్స్ తో కలిసి శైలజత్త కూతురు అను ఇమ్మాన్యుయేల్ బతుకమ్మ డ్యాన్సులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూర్తిగా చీరకట్టు - పరికిణీలో అనూ తళుకుబెళుకులతో ఈవెంట్ కే కొత్త కళ తెచ్చింది. ఇదే ఉత్సవాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - అల్లు అర్జున్ - నాగచైతన్య - విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. 140 మంది వలంటీర్లు రెండు నెలల పాటు ఈ ఈవెంట్ ఏర్పాట్ల కోసమే పని చేశారంటే అర్థం చేసుకోవచ్చు. డల్లాస్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (టిపిఏడీ) ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించింది.


డల్లాస్ బతుకమ్మ సరే.. ప్రస్తుతం బెంగళూరులో ఫ్యూజన్ స్టైల్ ఈవెంట్ కోసం శృంగార తార సన్నీలియోన్ రెడీ అవుతుండడం ప్రస్తుతం ఫిలింనగర్ లో చర్చకొచ్చింది. నవంబర్ 3న క్లీన్ సిటీ బెంగళూరు ఊగిపోయేలా ఈ ఈవెంట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ సంబరాలకు ఇది పూర్తి ఆపోజిట్ గా సాగే వెస్ట్రన్ స్టైల్ సంబరం అన్నమాట. బెంగళూరు మాన్యత టెక్ పార్క్- వైట్ ఆర్కిడ్స్ కన్వెన్షన్ హాల్ లో ఈ ఈవెంట్ సాగనుంది. బుక్ మై షోలో టిక్కెట్లు అమ్మేస్తున్నారు జోరుగా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com