ఇంకా నలబై నిమిషాలు యాడ్ చేస్తారట

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 05, 2017, 01:59 PM
 

లీడ్ హీరోగా చేసిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోలు అందుకునే బాక్స్ ఆఫీస్ రికార్డ్ ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు అర్జున్ రెడ్డి తో ఆ ఫీట్ మళ్ళీ రిపీట్ చేశాడు. ఇక దర్శకుడు సందీప్ వంగ కూడా దర్శక దిగ్గజాల మన్ననలను అందుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమా ఇప్పుడు పరభాషా స్టార్స్ ని కూడా ఆకర్షించే విధంగా తయారైంది. విడుదలై వారం రోజులు పూర్తవుతున్నా ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు.


182 నిమిషాల నిడివి గల అర్జున్ రెడ్డి లవ్ స్టోరి ప్రేక్షకులకు ఎక్కడా బోరో కొట్టకపోవడంతో ఇంకా కొన్ని సీన్స్ యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. ఇప్పటికే విజయ్ దేవరకొండ 15 నిమిషాల సీన్స్ ని యాడ్ చేయబోతున్నట్లు ఒక ప్రముఖ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. కానీ ఎడిట్  చేసిన కొన్ని సీన్స్ అందరికి  నచ్చుతాయి అనే ధీమాతో దర్శకుడు ఏం పర్వాలేదు అంటూ ఏకంగా 40 నిమిషాల సీన్స్ ని సినిమాలో కలిపెయ్యడానికి రెడీ అయ్యాడట. 


ప్రస్తుతం సినిమా నిడివి సమయాన్ని ఎవరు లెక్క చేయకుండా చూస్తున్నారు. ముందుగా చిత్ర యూనిట్ చెప్పినట్లు అప్పుడే సినిమా అయిపోయిందా అనే కామెంట్స్ వినబడుతున్నాయి. మరి 222 నిమిషాల నిడివి గల అర్జున్ రెడ్డి కోసం  ఇంకెంతమంది వెళతారో చూడాలి. అసలు ధియేటర్ వారు అంత లెంగ్త్ సినిమాను వేస్తారా అనేది ప్రశ్న. అర్జున్ రెడ్డి సినిమా కంటెంట్  బావుంటే ప్రేక్షకులు నిడివి సమయాన్ని లెక్క చేయరని నిరూపించింది కాని.. మరీ 40 నిమిషాలు కలపడం ఏంటి బాసూ?
Recent Post