తమిళ స్టార్ విజయ్ నటించిన చిత్రం ‘సర్కార్’. ఈ సినిమా టీజర్ దుమ్మురేపుతోంది. శుక్రవారం సాయంత్రం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు విశేషమైన స్పందన లభిస్తోంది. విడుదలైన కేవలం 35 నిమిషాల్లోనే 30 లక్షల వ్యూస్ దక్కించుకోవడం విశేషం. 16 గంటల్లో 11 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు ట్విటర్ ట్రెండింగ్ టాప్‌లో ‘సర్కార్టీజర్’ హ్యాష్‌ట్యాగ్ చేరిపోయింది. ఈ మేరకు అభిమానులు తమిళనాడులో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఫ్యాన్స్ సందడిగా కేకలు వేస్తున్న వీడియోను మురుగదాస్ ట్విటర్లో షేర్ చేశారు. ఆశ్చర్యంతో ‘దేవుడా’ అని ట్వీట్ చేశారు.
‘సర్కార్’కు ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘తుపాకీ’, ‘కత్తి’ చిత్రాలతో సూపర్ కాంబినేషన్ అనిపించుకున్న విజయ్-మురుగదాస్ కలయికలో మరో సినిమా రాబోతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో విజయ్ ఓ సాఫ్ట్వేర్ కంపెనీ సీఈవోగా కనిపించనున్నట్లు సమాచారం.
కీర్తిసురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో అశోక్ వల్లభనేని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాని దీపావళి సందర్భంగా నవంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.