కొత్త కెప్టెన్ దీక్ష

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 05, 2017, 02:32 PM
 

'బిగ్ బాస్' రియాల్టీ షో మరో మూడు వారాల్లో ముగియనున్న నేపథ్యంలో ఇంటి సభ్యుల మధ్య పోటీ తీవ్రతరం అయింది. ఇంట్లో గేమ్ బాగా ఆడుతూ బలవంతులుగా ఉన్న సభ్యులు... తమకు పోటీగా ఉన్న ఇతర సభ్యులను ఇంటి నుండి బయటకు పంపేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. సోమవారం షోలో జరిగిన పరిణామాలు పరిశీలిస్తే..... ఎలిమినేషన్ నామినేషన్స్ సమయం వచ్చిపుడు తమకు పోటీగా ఉన్నవారిని నామినేట్ చేసిన వైనం కనిపించింది. ఈ వారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో హరితేజ, ప్రిన్స్, అర్చన, ఆదర్శ్, నవదీప్ నామినేట్ అయ్యారు.


కెప్టెన్‍‌గా ఉన్న ముమైత్ ఎలిమినేట్ అయి ఇంటి నుండి బయటకు వెళ్లడంతో కొత్త కెప్టెన్ ను ఎన్నుకోవడం తప్పనిసరైంది. కెప్టోన్సీ కోసం నవదీప్, దీక్ష పోటీ పడగా...... ఆదర్శ్, హరితేజ, శివ బాలాజీ సపోర్టుతో దీక్ష కొత్త కెప్టెన్‌గా ఎంపికైంది.
Recent Post