విజయ్ సెల్ఫీ తీయగా.. అందులో కండలు చూపిస్తున్న వర్మ

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 05, 2017, 03:05 PM
 

మొత్తానికి యంగ్ హీరోను ఎలాగైతేనే తన బుట్టలో వేసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. అసలు 'అర్జున్ రెడ్డి' సినిమాకు ఆ సినిమా పి.ఆర్ఓ కంటే కూడా మన రామూనే భారీ ప్రచారం చేసిపెట్టాడు. కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు పోస్టర్లను చించగానే.. 'చిల్ తాతయ్య' అంటూ విజయ దేవరకొండ కామెంట్ చేస్తే.. వి.హెచ్.కు తన జీవితంలో అలాంటి ముద్దులు దొరకలేదని ఈర్ష పడుతున్నాడు అంటూ వర్మ కామెంట్లు చేసి.. పెద్ద రచ్చే లేపాడు. 


అక్కడితో ఆగలేదు.. అసలు పవర్ స్టార్ అనేవాడు ఫేక్ పవర్ స్టార్ అని.. వెంటనే విజయ్ దేవరకొండకు ఆ టైటిల్ ఇచ్చేయాలని చెప్పాడు. ఆ తరువాత నితిన్ నూ టార్గెట్ చేశాడు. తెలంగాణ మెగాస్టార్ టైటిల్ ను తాను వదిలేసుకుని విజయ్ కు ఇవ్వాలని చెప్పాడు. ఇవన్నీ సినిమాకు భారీ ప్రచారాన్ని తెచ్చిపెట్టేశాయి. అందుకేనేమో కృతజ్ఞత చూపించడానికి వెంటనే వర్మను కలిశాడు విజయ్. ఇద్దరూ ఏదో హోటల్లో కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నప్పుడు విజయ్ ఒక సెల్ఫీ తీయగా.. అందులో కండలు చూపిస్తున్న వర్మ.. ''నా ట్రైసెప్ (బాహువులు) చూసి విజయ్ నవ్వుకుంటున్నాడు'' అంటూ కామెంట్ చేస్తూ ఆ ఫోటోను షేర్ చేశాడు.


ఏదేమైనా కూడా వర్మ అండ్ విజయ్ ఫ్రెండ్ షిప్ ఇప్పుడు ఎటువంటి కొత్త సినిమాలకు దారితీస్తుందా అంటూ ఫ్యాన్స్ గాబరా పడుతున్నారులే. ఎందుకంటే వర్మ ఇలా స్నేహం చేసిన హీరోలందరితోనూ ఏదో ఒక సినిమా తీస్తుంటాడు. అది సంగతి
Recent Post