సంగీత దర్శకుడి నుండి నటుడిగా మారిన విజయ్ ఆంటోని బిచ్చగాడు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. తమిళ హీరో అయినప్పటికి తెలుగులోకి ఈ హీరోకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. బిచ్చగాడు తర్వాత బేతాళుడు,యమన్ అనే చిత్రాలతో విజయ్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు రాగా, ఇవి అభిమానులని అంతగా అలరించలేకపోయాయి. ప్రస్తుతం సి శ్రీనివాస్ దర్శకత్వంలో ఇంద్రేసేన అనే చిత్రాన్ని చేస్తున్నాడు విజయ్ ఆంటోని. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మెగాస్టార్ చిరంజీవి కొద్దిసేపటి క్రితం విడుదల చేసారు. ఇందులో విజయ్ ఆంటోని లుక్ స్టన్నింగ్‌గా ఉంది. పోస్టర్ లాంచింగ్ కార్యక్రంలో రాధిక, విజయ్ ఆంటోనిలతో పాటు చిత్ర బృందం హాజరైంది. ఇంద్రసేన సినిమాని విజయ్ ఆంటోని స్వయంగా రాధిక శరత్ కుమార్ తో కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని కూడా తెలుగు, తమిళ భాషలలో విడుదల చేయనున్నారు.