బాలీవుడ్లో ప్రముఖ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ రొమాన్స్ చేస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో రోహన్ పేరుతో ఆమె చేసిన పోస్టు వారిద్దరి సాన్నిహిత్యాన్ని బలంగా చెప్పింది. దాంతో వారిద్దరి అఫైర్‌పై భారీగా రూమర్లు చెలరేగుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటో పెట్టి రోహన్ క్లిక్ చేసిన తన బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్ చేసింది. ఆ ఫొటోను చూస్తుంటే రోహన్‌తో గడిపిన తాజా విషయాలు గుర్తొస్తున్నాయి అని కామెంట్ పెట్టింది. దాంతో వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే అనుమానం రేకెత్తింది. వాస్తవానికి రోహన్, శ్రద్ధాకపూర్ ఇద్దరు బాల్య స్నేహితులు. వారి స్నేహం ఇటీవల ప్రేమగా మారిందని వారి సన్నిహితులు చెప్పుకొంటున్నారు. అయితే వారి నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో ఈ వార్త రూమర్లకే పరిమితమైంది.