మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోటో షూట్ అందరిని ఆకట్టుకుంటోంది

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 06, 2017, 12:07 PM
 

మోడల్ గా జీవితాన్ని మొదలుపెట్టి ఎంతో కష్టపడి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మ కంగనా రనౌత్. అందమైన హీరోయిన్ గానే కాకుండా ఈ సుందరి లేడి ఓరియెంటెడ్ సినిమాలతో కూడా అలరించి బాక్స్ ఆఫీస్ రికార్డులను సైతం కైవసం చేసుకుంది. 


అయితే కంగన అప్పుడప్పుడు కొన్ని వ్యాఖ్యలతో కంగారు పెడుతూ ఉన్నా.. తన అందంతో మాత్రం ఎప్పుడు కవ్విస్తూనే ఉంటుంది కంగన. రీసెంట్ గా ఈ అమ్మడు పెళ్లి కూతురి వస్త్రాలకు ప్రత్యేకంగా చెప్పుకునే "హార్పర్స్ బజార్ బ్రైడ్" మ్యాగజైన్ కి ఇచ్చిన ఫోటో షూట్ అందరిని ఆకట్టుకుంటోంది. పెళ్లి కూతురి వస్త్రధారణలతో అమ్మడు వేసుకున్న డ్రెస్ చూడముచ్చటగా ఉంది. కాస్త క్లివేజ్ షోతో హాటుగా కనిపించినా తన మొహంలో అభినయం అందరిని ఆకర్షిస్తోంది.  మొత్తానికి కంగన రనౌత్ మూడు పదుల వయసు దాటినా పెళ్లి కుతురి డ్రెస్ లో మాత్రం నిజమైన పెళ్లి కుతురిలా ఉంది. అయితే కంగన పెళ్లి అంటే ఇపుడే పెళ్ళేంటి అంటోందట.


తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని ఇంకా సాదించాల్సినవి చాలా ఉన్నాయని పలు ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది ఈ సుందరి. అయితే ఆమె ఇచ్చిన ఫోటో షూట్ కి మాత్రం చాలా మంది ఫిదా అవుతున్నారు. దీంతో కంగన ఎదురుపడినపుడు తప్పకుండా పెళ్లి ప్రపోజల్ తేకుండా ఉండలేరరేమో..
Recent Post