స్పైడర్.. ఆడియో అక్కడ.. ప్రీరిలీజ్ ఇక్కడ?

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 07, 2017, 12:20 PM
 

మహేష్ బాబు నటిస్తున్న కొత్త సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ అప్ డేట్స్ కోసం జనాలు తెగ వెతికేసుకుంటున్నారు. మరో మూడు వారాల్లో సినిమా రిలీజ్ కానుండడంతో.. మూవీపై బజ్ అంతకంతకూ పెరుగుతోంది. సూపర్ స్టార్ నటిస్తున్న యాక్షన్ మూవీని ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అన్న ఇంట్రెస్ట్ అభిమానుల్లో కనిపిస్తోంది.


అయితే.. స్పైడర్ విషయంలో మహేష్ బాబు తన అభిమానులను బాగానే ఊరిస్తున్నాడు. తెలుగు.. తమిళ్ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి.. ఇటు టాలీవుడ్ లో పాటు అటు కోలీవుడ్ లో కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ.. రెండు చోట్ల ఫంక్షన్లు గట్రా ప్లాన్ చేస్తున్నారు. తమిళ్ లో మార్కెట్ సృష్టించుకునేందుకు తొలిసారిగా బై లింగ్యువల్ చేస్తున్న మహేష్.. ఈ నెల 9న చెన్నైలో గ్రాండ్ గా తమిళ్ ఆడియా రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నాడు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు కానీ.. తెలుగు పాటల విడుదలను కూడా అదే కార్యక్రమంలో చేసేస్తారట. ఎందుకంటే ఇక్కడ ఆడియో రిలీజ్ కాకుండా.. వేరే ప్రోగ్రామ్ చేయనున్నారు. 


నెల రోజుల ముందు ఆడియో వేడుక చేసి.. వారం-పది రోజుల ముందు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు ఇప్పుడు టాలీవుడ్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తోంది. అవుతోంది. అందుకే అదే ట్రెండ్ ను మహేష్ కూడా ఫాలో అవుతున్నాడట. తెలుగులో మనోల్ళు గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. అయితే తమిళనాట జరిగే తెలుగు-తమిళ ఆడియో ఫంక్షన్ కు దర్శకుడు శంకర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడని తెలుస్తోంది. మరి తెలుగు ఫంక్షన్ కు ఎవరు చీఫ్ గెస్ట్?
Recent Post