పెళ్ళైన హీరోయిన్ దుమ్మురేపుతోంది

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 07, 2017, 12:22 PM
 

సూపర్ సెక్సీ హీరోయిన్ కరీనా కపూర్ ను చూస్తే గ్లామర్ రూల్స్ అన్నింటిని కచ్చితంగా తిరగరాయాల్సిందే. సాధారణంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లు ఫేడవుట్ అయిపోతారు. గ్లామర్ కంటెంట్ పై ఇంట్రస్ట్ తగ్గిపోవడంతో నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ బెబో తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. పెళ్లి చేసుకుని.. పిల్లాడు పుట్టాక.. ఇప్పుడు మళ్లీ సన్నబడి తెగ దుమ్ము రేపుతోంది. 


బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ను పెళ్లి చేసుకున్న కరీనా ఇటీవల కొడుకు తైమూర్ కు జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ టైంలో బాగానే లావయ్యింది. పిల్లాడు కాస్త పెద్దవడంతో ఫిట్ నెస్ పై మళ్లీ దృష్టి పెట్టింది. జిమ్ కెళ్లి కసరత్తులు గట్టిగా చేయడంతో తిరిగి నాజూగ్గా తయారైంది. ఇప్పుడు కరీనా ఫిలింఫేర్ కోసం దిగిన హాట్ హాట్ ఫోజులు చూస్తుంటే ఆమెకు పెళ్లయి పిల్లాడు ఉన్నాడంటే ఏ మాత్రం నమ్మబుద్ధి కాదు.  ‘నాకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పరుచుకోవడం.. ఓ బిడ్డకు జన్మనివ్వడం ఎంతో సంతోషాన్ని కలిగించిన అంశాలు. నా సంతోషాన్ని నా కుటుంబం.. స్నేహితులు - అభిమానులతో కలిసి పంచుకున్నా. ఇందులో దాయడానికి ఏముంది. డెలివరీ సమయంలో లావయిన మాట వాస్తవమే. దాంతో మళ్లీ జిమ్ కు వెళ్లాను. వెయిట్ లాస్ కోసం చేసిన కసరత్తుతో కొత్త ఉత్సాహం వచ్చింది. నేను ఎక్సర్ సైజులు సైతం ఎంతో ఎంజాయ్ చేశానంటోంది’ వయసు పెరిగినా సొగసు తరగని ఈ సుందరి. 


ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి సినిమాలకు ఇంటర్వెల్ ఇచ్చిన కరీనా తిరిగి షూటింగులకు అటెండవుతోంది. తాజాగా వీర్ ది వెడ్డింగ్ సినిమా చేస్తోంది. ఈ సినిమాలో సోనమ్ కపూర్ తోపాటు కలిసి నటిస్తోంది. అసలు ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం కావల్సింది. షూటింగ్ ప్రారంభిద్దామనుకునే సమయానికి కరీనా ప్రెగ్నెంట్ అనే విషయం కన్ఫర్మ్ అయింది. దీంతో షూటింగ్ పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు స్టార్ట్ చేశారు
Recent Post