సమంతా చేతుల మీదుగా 'దృష్టి' ఫస్టులుక్ రిలీజ్

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 07, 2017, 02:34 PM
 

'అందాల రాక్షసి ' సినిమాతో తెలుగు తెరకి రాహుల్ రవీంద్రన్ పరిచయమయ్యాడు. ఈ సినిమా ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా క్రేజ్ రాలేదు. ఈ నేపథ్యంలో మంచి కథల కోసం వెయిట్ చేస్తూ వచ్చిన ఆయన, తాజాగా 'దృష్టి' అనే సినిమా చేశాడు.మోహన్ నిర్మాణంలో రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కి సంబంధించిన ఫస్టులుక్ పోస్టర్ ను సమంతా చేతుల మీదుగా ఈ రోజు ఉదయం రిలీజ్ చేశారు. టైటిల్ ను డిజైన్ చేసిన తీరు .. పోస్టర్ ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకునేలా వున్నాయి. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. 
Recent Post