వారి విషెస్ కి సమంత ఫిదా

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 07, 2017, 04:19 PM
 

టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఫెమస్ ప్రేమ జంటగా వెలిగిపోతున్నారు నాగ చైతన్య - సమంత. అక్కినేని కుటుంబంలో మరో తార కోడలిగా చేరటాన్ని అక్కినేని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఎక్కడ చూసినా వీరిద్దరి గురించే ఇప్పుడు సంబాషించుకుంటున్నారు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నందుకు ఈ ప్రేమ జంటకు కొందరు అడ్వాన్స్ విషెస్ చెబుతున్నారు. 


ప్రస్తుతం నాగ చైతన్య యుద్ధం శరణం సినిమాని తెగ ప్రమోట్ చేస్తున్నాడు. మొదటి సారి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో కనిపించబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల వద్దకు చేరేలా ముందుగానే చైతు ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా ప్రమోషన్స్ లో భాగంగా చైతు ఏలూరు లోని రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళాడు. అక్కడి స్టూడెంట్స్ చైతూకు ఘన స్వాగతం పలికారు. అంతే కాకుండా కొంతమంది విదార్థులు కలిసి వారి స్టైల్ లో అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ విషెస్ తెలిపారు. 


అయితే ఆ ఫోటో చుసిన సమంత వారి అభిమానానికి తెగ సంబరపడిపోయి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా వారి అభిమానానికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది. అలాగే నెటిజన్స్ కూడా ఆ ఫోటోని ఇష్టంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రేమ జంట అక్టోబర్ నెలలో  వివాహ బంధంతో మరింత దగ్గరవ్వనున్నారు. గోవాలో అక్టోబర్ 6న పెళ్ళి ముహూర్తం నిశ్చయించారనే సంగతి తెలిసిందే. 
Recent Post