అమ్మాయి కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెత్తేవాడట

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 07, 2017, 04:22 PM
 

పెళ్లి చూపులు లాంటి డీసెంట్ సినిమాలో డీసెంట్ గా కనిపించి ఆ తర్వాత ద్వారకలో అమాయక బాబాగా బలే నటించాడు విజయ్ దేవరకొండ. ఆ రెండు సినిమాలకు పూర్తి బిన్నంగా అర్జున్ రెడ్డి సినిమాలో అసలు ఇతను ఇంతకుముందు చుసిన హీరోనేనా అని ఎవరికీ వారు మాట్లాడుకునేలా చేశాడు. అందుకోసం 'అర్జున్ రెడ్డి' సినిమాలో హీరోయిన్ తో ఏ రేంజ్ లో రొమాన్స్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమాలో ఉన్నట్టుగా వన్ పర్సెంట్ అయినా విజయ్ నిజ జీవితంలో ఉంటాడా అంటే ప్రవర్తనలో ఉండవచ్చు గాని అమ్మాయిల విషయంలో మాత్రం అస్సలు 1% కూడా అలా ఎప్పుడూ లేను అంటున్నాడు.


ప్రస్తుతం విజయ్ కి అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెరిగిపోయింది. అయితే మనోడు ఒకప్పుడు అమ్మాయి కనిపిస్తే చాలు ఆమడ దూరం పరిగెత్తేవాడట. అంతే కాకుండా వారు ప్రపోజ్ చేస్తే భయంతో మళ్లీ వారి కంటపడకుండా జాగ్రత్తలు తీసుకునేవాడట. అలా ఉండడానికి ఒక బలమైన కారణం ఉందంటున్నాడు. ఎందుకంటే చిన్నపుడు ఎక్కువగా అతను బయటి ప్రపంచానికి దూరంగా ఉండేవాడట. ఇక తను స్కూల్ దశతో పాటు ఇంటర్మీడియెట్ వరకు మొత్తం అమ్మాయిలు లేని పుట్టపర్తి రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిందని.. అక్కడే చదువుకుంటూ.. ఏడాదికి ఒకసారి అమ్మానాన్నను కలిసేవాడినని చెప్పుకొచ్చాడు. ఇక అక్కడి ప్రపంచంలో అంతా ఒక సిస్టమ్ తో నడిచేదని.. న్యూస్ పేపెర్ లు తప్ప ఒక  టివి కూడా ఉండేది కాదని దీంతో తాను చాలా పద్దతిగా ఉండేవాడినని చెప్పాడు. 


ఫైనల్ గా అక్కడ ఇంటర్ అయిపోగానే కాస్త బయటప్రపంచంలోకి అడుగుపెట్టి డిగ్రీలో చేరాడు.  తర్వాత అలవాటు లేని జీవితం చాలా కొత్తగా ఉండేదట. అందరితో కలిసిపోవడానికి కొద్దిగా టైమ్ తీసుకున్నాడట. ఇక మనోడి గ్లామర్ కి అమ్మాయిలు ఎగబడితే ఏం చెయ్యాలో తెలియక అక్కడి నుంచి మాయమైపోయేవాడట. మొత్తానికి ఈ మ్యాటర్ చెప్పాక అసలు మనోడు సినిమాలో కనిపించేంత తెలివైనవాడు కాదు అనాలా? లేకపోతే బ్రతకడం నేర్చుకున్న తెలివైనవాడు అనాలా?
Recent Post