నందుతో శ్రీముఖి రొమాన్స్

  Written by : Suryaa Desk Updated: Thu, Sep 07, 2017, 04:46 PM
 

జేపీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ధ‌న జ‌మ్ము నిర్మాతగా శ్రీను ఇమంది ద‌ర్శ‌కత్వంలో బీటెక్ బాబులు చిత్రం నిర్మించ‌బ‌డింది. సెప్టెంబ‌ర్ 6వ తేదీ సాయంత్రం 6.06నిమిషాల‌కు ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌చార చిత్రం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి. వినాయ‌క్ చేతుల మీదుగా విడుద‌ల చేయ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా..వి.వి వినాయ‌క్ గారు మాట్లాడుతూ.. ఇప్పుడే ట్రైల‌ర్ చూశాను. చాలా బాగుంది. సినిమా కూడా మంచి స‌క్సెస్ అవ్వాల‌ని, డైర‌క్ట‌ర్ శ్రీను కి ఓ మ‌లుపు అవ్వాల‌ని, నిర్మాత‌ల‌కు బాగా డ‌బ్బు రావాల‌ని కోరుకుంటున్నానన్నారు.నిర్మాత‌లు ల‌క్ష్మీ నాయుడు , ధ‌న మాట్లాడుతూ.. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంది. చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని అన్ని స‌న్నాహాలు చేస్తున్నాం. మా సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం అన్నారు.డైర‌క్ట‌ర్ శ్రీను ఇమంది మాట్లాడుతూ.. మా సినిమా యొక్క ప్ర‌చార‌చిత్రం వి. వి వినాయ‌క్ గారి చేతుల మీదుగా విడుద‌ల అవ్వ‌డ‌మే మా సినిమా సాధించిన‌ మొద‌టి విజ‌యంగా భావిస్తున్నామ‌ని, సెన్సార్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న మా చిత్రం ఈ నెలాఖ‌రులో గానీ, వ‌చ్చే నెల మొద‌టి వారంలో గానీ విడుద‌ల చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని తెలియ‌జేశారు.చిత్ర తారాగ‌ణంలో నందు, శ్రీముఖి, ష‌క‌ల‌క శంక‌ర్, రాణి, నావ‌ల్ కిషోర్, వైజాగ్ శంక‌ర్, అశ్విని, శౌర్, రోషిణి, మ‌నీషా, తాగుబోతు రమేష్, అలీ, ప‌విత్రా లోకేష్, వైవా హ‌ర్ష‌, రాకెట్ రాఘ‌వ‌, ప‌టాస్ ప్ర‌కాష్


సాంకేతిక విభాగంలో సినిమాటోగ్ర‌ఫీ - సాయిచ‌ర‌క్ మాధ‌వ‌న్‌ని, సంగీతం - అజ‌య్ ప‌ట్నాయ‌క్, నేప‌థ్య సంగీతం - శేఖ‌ర్ చంద్ర‌ తదితరులు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
Recent Post