నయనతార మూవీ 'వేలైక్కారన్' రిలీజ్ వాయిదా!

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 08, 2017, 03:40 PM
 

ఈ మధ్య కాలంలో తమిళంలో నయనతార చేసిన సినిమాల్లో 'వేలైక్కారన్' ఒకటి. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. ఇంతకు ముందు ఆయన 'తని ఒరువన్' హిట్ ఇచ్చి ఉన్నందు వలన, ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.దసరా కానుకగా ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడం వలన, ఆ రోజున ఈ సినిమా థియేటర్లకి రావడం లేదు. దీపావళికి పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండటంతో, తమ సినిమాను డిసెంబర్ కి తీసుకెళ్లారు. డిసెంబర్ 22న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నయనతార అభిమానులు అప్పటివరకూ వెయిట్ చేయవలసిందే.      
Recent Post