వేశ్యపాత్ర చేయటానికి సిద్దపడింది

  Written by : Suryaa Desk Updated: Fri, Sep 08, 2017, 03:51 PM
 

కొన్నేళ్ల క్రితం హోమ్లీ, గ్లామరస్‌ పాత్రలతో మెప్పించిన సదా ప్రస్తుతం అవకాశాలు లేక సతమతమవుతోంది.అప్పుడప్పుడు వచ్చే అవకాశాలు, రియాలిటీ షోలలో జడ్జిగా కనిపిస్తూ ఏదోలా కెరీర్ బండిని లాక్కొస్తున్న ఈ ముదురు భామకు రీసెంట్‌గా కోలీవుడ్‌లో చాన్స్ రావడం విశేషం. ఇప్పుడు ఆమె చేతిలో ఒకే ఒక్క చిత్రం 'టార్చ్‌లైట్‌'.1980ల నాటి నేపథ్యంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో నటీనటులు ధరించే దస్తులు, లొకేషన్లు అన్నీ ఆనాటి వాతావరణానికి తగ్గట్టే ఉంటాయట. ఇందులో సదా వేశ్య పాత్రలో నటిస్తుండగా, ఆమె ఆహార్యం కూడా వైవిధ్యంగా ఉండబోతుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.


ఒక అమ్మాయి వేశ్యగా ఎలా మారింది? తిరునల్వేలి, కుట్రాలం పరిసరాల్లో గ్రామాల్లో ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. జీవితంపై ఎన్నో కలలు ఉన్న ఒక అమ్మాయి వేశ్యగా ఎలా మారింది? అందుకు దారితీసిన పరిస్థితులేంటి? అన్న కథతో దర్శకుడు మజీద్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వేశ్య పాత్రలో నటించేందుకు మొదట సంశయించినా దర్శకుడు చెప్పిన కథ విన్నాక కళ్లలో నీళ్లు తిరిగాయని, వెంటనే ఓకే చెప్పేశానని సదా చెబుతోంది.


కోలీవుడ్ దూరం పెట్టింది రెండేళ్ల క్రితం వడివేలు హీరోగా నటించిన ‘ఎలి' సినిమాలో అతడి సరసన నటించిన సదాను కోలీవుడ్ దూరం పెట్టింది. వడివేలు సరసన నటించిన హీరోయిన్‌తో నటించడం ఎందుకని అనుకున్నారో ఏమో కానీ.. కోలీవుడ్‌లోని హీరోలెవరూ ఆమెకు అవకాశాలు ఇవ్వలేదు. ఆ తరువాత రెండు బాలీవుడ్ సినిమాల్లో నటించినా అవి కూడా బోల్తా కొట్టాయి. దీంతో అమ్మడికి కోలీవుడ్‌లో తెరకెక్కే ‘టార్చ్ లైట్' రిజల్ట్ కీలకం కానుందని ప్రచారం జరుగుతోంది.


 
Recent Post