మహానటి మూవీ తర్వాత వరుసగా రెండు తమిళ మూవీల్లో కీర్తి సురేష్ నటించింది. తాజాగా తమిళంలోనే మరో రెండు మూవీలు ఆమె చేతిలో ఉన్నాయి.. అయితే ఈ పాత్రల పట్ల కీర్తి కొంత అసహనంగా ఉంది. ఈ మూవీల్లో గ్లామర్ రోల్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, వారికే ఎక్కువ రెమ్యునరేషన్ కూడా ఉంటుందని వాపోయింది.. అయితే తాను గ్లామర్ రోల్స్ కూ పూర్తిగా వ్యతిరేకమని అంటున్నది..నటనలో భాగంగా ఉండే గ్లామర్ రోల్స్ అయితే నటించేందుకు ఎప్పుడూ సిద్దమేనని తెలిపింది.. ఇదే క్రమంలో తాను 2013లో మలయాలం మూవీ గీతాంజలి లో డి గ్లామర్ పాత్రలో నటించానని, అటువంటి పాత్రలంటే తనకెంతో ఇష్టమని తెలిపింది.. అటువంటి పాత్రలు వస్తే పారితోషికంతో సంబంధం లేకుండా నటిస్తానని, దర్శక, నిర్మాతలు, రచయితలు అటువంటి కథలను రూపొందించాలని అభిప్రాయపడింది.