స్పైడ‌ర్ సిసిలియా ప్రోమో సాంగ్ విడుద‌ల‌

  Written by : Suryaa Desk Updated: Sat, Sep 09, 2017, 01:55 PM
 

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా న‌టించిన‌ చిత్రం స్పైడర్. ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న స్పైడ‌ర్ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలిసారి ఈ చిత్రం ద్వారా మహేష్ తమిళ ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ రోజు సాయంత్రం చెన్నైలో రెండు భాషలకు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు సాంగ్స్ ప్రోమోస్ విడుద‌ల చేసిన మేక‌ర్స్ తాజాగా సిసిలియా ప్రోమో సాంగ్‌ని విడుద‌ల చేస్తూ నేడే ఆడియో విడుద‌ల అనే విష‌యాన్ని తెలిపారు. హ‌రీష్ జై రాజ్ అందించిన సంగీతం మ్యూజిక్ ల‌వ‌ర్స్‌కి మ‌త్తెక్కించ‌డం ఖాయ‌మ‌ని అంటుంది చిత్ర యూనిట్‌. ఇక చిత్ర ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మానికి ప్రముఖ దర్శకుడు శంకర్, ఎస్.ఎస్.రాజమౌళి ముఖ్య అతిధులుగా పాల్గొని తెలుగు, తమిళ వెర్షన్‌లకు సంబంధించిన ఆడియోలను రిలీజ్ చేయనున్నారని టాక్ వినిపిస్తుండ‌గా దీనిపై క్లారిటీ లేదు. మ‌రి తాజాగా విడుద‌లైన సిసిలియో ప్రోమో సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.Recent Post