అర్జున్ రెడ్డి పై రానా కామెంట్స్

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 11, 2017, 09:21 AM
 

వినూత్న కథాంశం తో వచ్చి ఎంతో మందికి ఈజీగా కనెక్ట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాలో ఉన్న కంటెంట్ కి దాదాపు యూత్ మొత్తం ఫిదా అవ్వడంతో ఆ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కి కొత్త దారిని ఏర్పాటు చేసింది. ఇప్పటికే సినిమా మొత్తం 40 కోట్లను దాటి 50 కోట్ల మార్క్ ను అందుకునేందుకు వెళుతోంది. 


అయితే సినిమా గురించి స్టార్స్ కూడా బావుందని కామెంట్ చేయడం కలెక్షన్స్ మరొక ఊపును ఇచ్చింది. దీంతో ప్రతి ఒక్క స్టార్ ఇప్పుడు స్పెషల్ షోస్ వేసుకొని మరి మూడు గంటల సినిమాను బ్రేక్ లేకుండా చూసేస్తున్నారు. అయితే రానా కూడా ఈ సినిమాపై ఓ మీడియాకు ఇచ్చిన ఉంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అదే విధంగా అర్జున్ రెడ్డి సినిమా యువతను తప్పు దోవ పట్టించెట్లు ఉందా అని ఎదురైన ప్రశ్నకు రానా ఈ విధంగా సమాధానం చెప్పడు.


''ఒక సినిమా ఒక వ్యక్తిని చెడగొడుతుంది అనడంలో నిజం లేదు. అది అనవసరమైన వ్యాఖ్యలు అని చెబుతూ.. సాధారణంగా ఉండే యాక్షన్ సినిమాలో హీరో విలన్ ని చంపేసినంత మాత్రన బయట ఎవరు చంపడం లేదు కదా'' అని తనదైన శైలిలో సమాధానాన్ని ఇచ్చాడు. అదే విధంగా సినిమా గురించి మాట్లాడుతూ..సినిమా చాలా నచ్చింది. ముఖ్యంగా  విజయ్ దేవరకొండ అద్భుతంగా నటించడాని చెప్పాడు రానా.
Recent Post