బిగ్‌బాస్‌కు అందుకే నో చెప్పా: టాప్‌ యాంకర్‌

  Written by : Suryaa Desk Updated: Mon, Sep 11, 2017, 10:30 AM
 

 తెలుగు టీవీ టీఆర్పీలో బిగ్‌బాస్‌ షో సంచలనం అంతా ఇంతా కాదు. జూనియర్ ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఇటీవలే 50 రోజుల పండుగ చేసుకొని తుది దశకు చేరుకుంది. తొలుత ఈ షో కంటెస్టంట్లుగా చాలా పెద్ద స్టార్స్ నే అనుకున్నారు. కానీ వారు అన్ని రోజులు హౌస్ లో ఉండడానికి ఇష్టపడలేదు. మరి కొంతమంది షూటింగ్స్ వల్ల బిజీగా ఉండి నో చెప్పారట. ప్రస్తుతం పాపులర్‌ యాంకర్‌గా మారిన శ్రీముఖికి కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. కానీ అందుకు శ్రీముఖి ఒప్పుకోలేదట. దానికి గల కారణాన్ని ఇటీవల ఫేస్‌బుక్‌  లైవ్ చాట్ లో నెటిజన్లకు చెప్పింది.


తనకు బిగ్‌బాస్‌ షో అంటే చాలా ఇష్టం అని, హిందీ షో వచ్చినపుడు చూసిన షోలనే పదే పదే చూసేదాన్నని చెప్పింది. ప్రముఖ చానెల్‌లో ప్రసారం అవుతున్న కామెడీ షోలతో బిజీగా ఉండటం వల్లే బిగ్‌బాస్ చేయలేక పోయానని తెలిపింది. బిగ్‌బాస్‌ షో నుం‍చి తనకు ఫోన్‌ వచ్చిన ముందు రోజే తాను కొత్త షోకు ఒప్పుకున్నానని అందువల్లే బిగ్‌బాస్‌లో ఆడలేక పోయానని శ్రీముఖి పేర్కొంది.




Recent Post