మలయాళీ కుట్టి ట్యాలెంటే వేరప్పా

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 12, 2017, 11:21 AM
 

మలయాళీ ముద్దుగుమ్మ కీర్తి సురేష్.. టాలీవుడ్ లో సెన్సేషన్స్ సృష్టించేస్తోంది. పవన్ కళ్యాణ్ పక్కన లీడ్ హీరోయిన్ రోల్ లో నటించేయడమే కాదు.. మహానటి అంటూ సావిత్రి జీవితంపై రూపొందుతోన్న సినిమాలోను ఆ మహానటి పాత్రలో కనిపించబోతోంది. కీర్తి సురేష్ ట్రెడిషనల్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలు నెట్ లో చక్కర్లు కొట్టాయి. కొన్ని దశాబ్దాల క్రితం సినిమాల్లో హీరోయిన్స్ లుక్ మాదిరిగా ఈ ఫోటోలు ఉండడంతో.. సావిత్రిగా కీర్తి సురేష్ లుక్ ఇదే అంటూ ప్రచారం జరిగింది.


సాంప్రదాయబద్ధంగా కీర్తి సురేష్ కనిపిస్తున్న ఈ ఫోటోలను చూసి.. అందరూ ఇదే మహానటి ఫస్ట్ లుక్స్ అని ఫిక్స్ అయిపోయారు. అయితే.. ఇప్పుడు సడెన్ గా షాక్ ఇచ్చేసింది కీర్తి. వాస్తవానికి ఆ ఫోటోలను షేర్ చేసింది తనే కానీ.. అప్పుడు అసలు విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు మహానటి లుక్ అంటూ ప్రచారం జరుగుతుండడంతో.. పెదవి విప్పిన కీర్తి సురేష్.. ఈ ఫోటో ఓ బ్రాండ్ కమర్షియల్ యాడ్ షూటింగ్ లో భాగం మాత్రమే. మహానటి లుక్ ఇంకా విడుదల కాలేదంటూ మళ్లీ సోషల్ మీడియా ద్వారానే అసలు విషయం వివరించింది కీర్తి సురేష్.


ఇదంతా కాసేపు పరిశీలిస్తే.. తన గురించి ఎప్పటికప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవడంలో.. కీర్తి ట్యాలెంట్ అర్ధం చేసుకోవచ్చు. ముందు ఓ లుక్ ఇవ్వడం.. జనాలను కన్ఫ్యూజ్ చేయడం.. ఆ తర్వాత అసలు వాస్తవం ఇదంటూ చెప్పడం.. ఏమైనా మలయాళీ కుట్టి ట్యాలెంటే వేరప్పా అనుకోవాల్సిందే. ఇక మహానటి చిత్రంలో సమంత.. దుల్కర్ సల్మాన్.. విజయ్ దేవరకొండ.. ప్రకాష్ రాజ్ లు నటిస్తుండగా.. రీసెంట్ గా అర్జున్ రెడ్డి మూవీతో మంచి పేరు సంపాదించుకున్న షాలినీ కూడా నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి.
Recent Post