నలుగురి హీరోలతో మణిరత్నం మూవీ

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 12, 2017, 11:22 AM
 

ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం. తన సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఈ సీనియర్ దర్శకుడు గత కొంత కాలంగా సరైన విజయాన్ని అందుకోవడం లేదు. తీసిన ప్రతి సినిమా మిక్సుడ్ టాక్ యావరేజ్ గా నిలుస్తున్నాయి లేదా డిజాస్టర్స్ అయినా అవుతున్నాయి. దీంతో మణిరత్నం ఈ సారి స్టైల్ ను మార్చేశాడు. 


త్వరలోనే నాలుగురు హీరోలతో ఓ మీడియం మల్టీ స్టారర్  సినిమాతో రాబోతున్నాడు. అది కూడా తెలుగు తమిళ్ లో ఒకేసారి తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే శింబు - విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫజిల్ లను ఒకే చేసిన మణి త్వరలోనే నానిని కూడా ఫైనల్ చేబోతున్నాడట. ప్రస్తుతం నాని రెండు సినిమాతో బిజీగా ఉన్నాడు మారి ఈ సినిమాకు ఒప్పుకుంటాడా లేదో కాస్త సందేహంగానే ఉంది. 


ఇక హీరోయిన్స్ గా జ్యోతికా మరియు ఐశ్వర్యా రాజేష్ ని ఫైనల్ చేశారు. ఇక మరికొంతమంది నటినములను సెలక్ట్ చేసే పనిలో ఉన్నాడట దర్శకుడు. ఇక ఇద్దరు హీరోయిన్స్ సినిమాలో సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. జ్యోతిక అయితే నాచియర్ సినిమా తర్వాత నేను ఒప్పుకున్నా మరోక సినిమా మణిరత్నం గారిదే అని మీడియాకు తెలిపింది.   
Recent Post