స్కూబా డైవింగ్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తున్న త్రిష

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 12, 2017, 11:27 AM
 

నీ మనసు నాకు తెలుసు అంటూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న త్రిష ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విషయం తెలిసిందే. దాదాపు టాలీవుడ్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. అమ్మడికి మూడు పదులు వయసు దాటినా అందంలో మాత్రం ఇంకా పదహారేళ్ళ అమ్మాయిలనే కనిపిస్తోంది. ఇప్పటికి కూడా చేస్తున్నది చిన్న సినిమాలే అయినా ఏడాదికి నాలుగైదుకు తక్కువ చేయడం లేదు. 


అయితే ప్రస్తుతం బిజీ షెడ్యూల్ లోనే ఉన్నా అమ్మడు కొంచెం గ్యాప్ తీసుకొని ఓ సముద్రంలో స్కూబా డైవింగ్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది. సముద్రం అడుగుకి వెళ్లేముందు స్కూబా డైవింగ్ గెటప్ లో ఫోటోకి పోజ్ కూడా ఇచ్చింది. ఇక ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి చాలా రోజుల తర్వాత అభిమానులకు సెల్ఫీ తీసుకొని వెరైటీగా దర్శనమిచ్చింది. త్రిషకి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం. విదేశాలకు వెళ్లిందంటే ఒక వారం రోజులు అక్కడి ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరుతూ ఉంటుందట. 


ప్రస్తుతం త్రిష ఏకంగా ఆరు సినిమాలతో బిజీగా ఉంది. అందులో 5 తమిళ సినిమాలు కాగా ఒకటి మలయాళ చిత్రం. ఆ చిత్రాలు చిన్న బడ్జెట్ తో తెరకెక్కుతున్న సరే అమ్మడు ప్రతి సినిమాలో లీడ్ రోల్ లోనే మెరవనుందట ఇక 1818 అనే సినిమా అమ్మడికి కీలకం కానుంది. ఆ సినిమాను తెలుగు తమిళ్ లో రితున్ సాగర్ తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాలో బ్రహ్మానందం -రాజేంద్ర ప్రసాద్ లు కూడా నటిస్తున్నారు.    
Recent Post