లక్ష్మీ రాయ్ స్పైసీ సినిమాకి నో కట్స్

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 12, 2017, 12:08 PM
 

లక్ష్మీ రాయ్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తూ చేసిన చిత్రం ‘జూలీ -2’. బోల్డ్, బ్యూటిఫుల్, బ్లెస్సెడ్ అనే క్యాప్షన్ తో వస్తున్న ఈ చిత్రం దానికి తగ్గట్టే చాలా బోల్డ్ గా రూపొందింది. పోస్టర్లు, టీజర్, ట్రైలర్లతో సంచలనంగా మారిన ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తిచేసుకుంది.

సెన్సార్ బోర్డు ఏ సినిమాకు ‘A’ సర్టిఫికెట్ ను జారీ చేసింది. అది కూడా ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తవడం విశేషం. ఇలా సెన్సార్ సభ్యులు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా సినిమాను యాక్సెప్ట్ చేయడంతో అందులో ఎంత బలమైన కంటెంట్ ఉందో అని అందరిలోనూ కొత్త ఆసక్తి మొదలైంది. ఇకపోతే దీపక్ శివదాసిని డైరెక్టక్ చేసిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Recent Post