నివేత థామస్ పవన్ యాటిట్యూడ్ ని ఇమిటేట్ చేస్తూ

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 12, 2017, 12:14 PM
 

జై లవకుశ ట్రైలర్ తో జూనియర్ ఎన్టీఅర్ తనలో నటుడుకి వంద శాతం పని చెప్పాడు. అతనిలో అన్ని రకాల టైమింగ్ ఎమోషన్స్ ని ఈ సినిమాలో బయటకి తీసాడు. దీంతో ఒక్కసారిగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరో వైపు సాంగ్ టీజర్స్ కూడా తాజాగా రిలీజ్ చేసారు. ఇందులో జై పాత్రలో ఎన్టీఅర్, నివేత థామస్ మధ్య రొమాంటిక్ సాంగ్ లో ఎన్టీఆర్ ఫుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు. అయితే ఈ పాటలో కొసమెరుపు ఏంటంటే, హీరోయిన్ నివేత థామస్ పవన్ యాటిట్యూడ్ ని ఇమిటేట్ చేస్తూ కనిపించడం. దీంతో ఇందులో హీరోయిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనే టాక్ బయటకి భాగా వినిపిస్తుంది. ఈ పాట తో ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కూడా ఫిదా చేసి తన సినిమాకి ఫుల్ క్రేజ్ తెచ్చుకునే పనిలో ఉన్నాడని అందరు అనుకుంటున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పాట భాగా ట్రెండ్ అవుతూ పవన్ ఫ్యాన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుంది. నిజంగా సినిమాలో హీరోయిన్ పవన్ ఫ్యాన్ అయితే ఇక జై లవకుశ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనడంలో ఎలాంటి సంకోచం లేదు.