అమలకు నాగ్‌ బర్త్‌డే విషెస్‌

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 12, 2017, 12:27 PM
 

హైదరాబాద్‌: నటి అక్కినేని అమల నేడు 48వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా అమల భర్త, నటుడు అక్కినేని నాగార్జున ఆమెకు సోషల్‌మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.‘ఐ లవ్యూ స్వీట్‌హార్ట్‌. నీతో కలిసి చాలా కాలం జీవించాలని నాకు నేనే విష్‌ చేసుకుంటున్నా. హ్యాపీబర్త్‌డే’ అని నాగ్‌ విష్‌ చేశారు. నాగార్జున, అమల కలిసి ‘ప్రేమ యుద్ధం’, ‘చినబాబు’, ‘కిరాయి దాదా’, ‘శివ’, ‘నిర్ణయం’ చిత్రాల్లో నటించారు. వీరు 1992లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక ఆమె సినిమాలకు దూరమయ్యారు. చాలా కాలం తర్వాత 2012లో వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ చిత్రంలో నటించారు.