ఇమ్రాన్ హాష్మి అవుతాడా ? ఏంటి?

  Written by : Suryaa Desk Updated: Tue, Sep 12, 2017, 03:42 PM
 

ప్రస్తుత రోజుల్లో హీరోలుగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలంటే ఏ స్థాయిలో కష్టపడాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ రోజుల్లో సినిమాకంటే ముందు హీరోల యాటిట్యూడ్ ని కూడా ప్రేక్షకులు చాలా ఇష్టపడుతున్నారు. ఒక వేళ సినిమా హిట్ కాకున్నా వారి వ్యవహార శైలితో అభిమానులను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి హీరో సినిమాలకన్నా తన వ్యవహార శైలితోనే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్నాడు.ఇక ఇతర హీరోలు కూడా ఎవరి స్థాయిలో వారు అభిమానులను సంపాదించుకుంటున్నారు. 


అలాగే ఇప్పుడిపుడే హీరోగా ఎదుగుతున్న అర్జున్ రెడ్డి హీరో విజయదేవరకొండ కూడా తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక తనకంటూ ఓ వర్గం ప్రేక్షకులను సెట్ చేసుకున్నాడు. ఎంత కొత్త కథ అయినా ఆ సినిమా ప్రేక్షకుల వరకు వెళ్లాలంటే ప్రచారాన్ని తప్పకుండా నిర్వహించాలి. అందరిలా ఎదో ప్రెస్ మీట్ - ఫంక్షన్స్ చేస్తే సరిపోవట్లేదు. ఎదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమాకు హైప్ తేవాలి. ఆ స్థాయిలో అర్జున్ రెడ్డి సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. కేవలం ప్రమోషన్స్ వల్లే ఈ సినిమా ఊహించని స్థాయిలో హిట్ అయ్యిందని చెప్పవచ్చు. సినిమా కూడా బావుంది కానీ ప్రమోషన్స్ చేయకుంటే ఆ స్థాయిలో హిట్ అయ్యేది కాదు అనేది కొందరి వాదన. 


ఇక ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండ అయితే తన మాటలతోనే సినిమాని మరో స్థాయికి చేరేలా చేశాడు. అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇబ్బందిగా ఉన్నా యువతకు మాత్రం బాగా నచ్చేశాయి. సినిమా ట్రైలర్ - పోస్టర్స్ లో కూడా మనోడు చాలా వివాదాలనే రేపాడు.అర్జున్ రెడ్డి పాత్రను నిజ జీవితంలో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు.  ఇక తన నెక్స్ట్ సినిమా పోస్టర్ కూడా అదే స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నాడు. రీసెంట్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ లో అమ్మాయి థైస్ ని తన భుజంపై వేసుకొని ఇచ్చిన స్టీల్ తో మరోక కొత్త ప్రయోగమే చేస్తున్నాడు. ఓ విధంగా చెప్పాలంటే  టాలీవుడ్ ఇమ్రాన్ హష్మీ రేంజ్ లో రెచ్చిపోతున్నాడనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఏది చేసినా కొంత వరకు చేస్తే బావుంటుంది. మరి ప్రతిసారి ఇదే తరహాలో రెచ్చిపోతే  కెరీర్ ను మళ్లీ డౌన్ చేసుకోవడమే అనే కామెంట్స్ కూడా వినబడుతున్నాయి.
Recent Post