ప్రభాస్ ఆతిథ్యం మాములుగా లేదు : శ్రద్ధా కపూర్

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 13, 2017, 10:57 AM
 

ప్రభాస్ ఇప్పుడు 'సాహో' సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. ఈ సినిమాతోనే శ్రద్ధా కపూర్ తెలుగు తెరకి పరిచయం అవుతోంది. రీసెంట్ గా ఆమె ఈ సినిమా షూటింగులో జాయిన్ అయింది. ఈ సినిమా షూటింగ్ లొకేషన్లో ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యం మాములుగా లేదని శ్రద్ధా కపూర్ చెప్పింది. 


ఈ సినిమా షూటింగులో లంచ్ బ్రేక్ చెప్పాక, తనతో పాటే శ్రద్ధా కపూర్ కి కూడా ప్రభాస్ భోజనం తెప్పించాడట. భోజనంలోకి రకరకాల కూరలు .. పచ్చళ్లు .. పులుసులు ఉండటం చూసి తాను ఆశ్చర్యపోయానని శ్రద్ధా కపూర్ అంది. చికెన్ పులుసు ..  ఎగ్ కర్రీ .. గోంగూర మటన్ .. పీతల ఇగురు .. ములక్కాడ పులుసు .. తోటకూర .. రోటి పచ్చళ్లతో భోజనం అదిరిందని చెప్పింది. మొత్తానికి ప్రభాస్ తొలి తెలుగు సినిమా షూటింగును .. తెలుగు వారి ఆతిథ్యాన్ని శ్రద్ధా కపూర్ మరిచిపోకుండా చేశాడన్న మాట.     
Recent Post