ఆడ గెటప్ లో ఆ హీరో కూడా

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 13, 2017, 11:43 AM
 

హీరోలు లేడీ గెటప్ లో కనిపించడం కొత్తేమీ కాదు. పలు సార్లు అనేక మంది హీరోలు ఇలాంటి ప్రయత్నాలు చేశారు. స్టార్ హీరోలు కూడా అడపాదడపా ఆడ గెటప్ వేసిన సందర్భాలు కనిపిస్తాయి. కానీ హీరో పూర్తి స్థాయి సినిమాలో లేడీ గెటప్ లో కనిపించే విధంగా వచ్చిన  సినిమాల కౌంట్ తక్కువే.


టాలీవుడ్ చిత్రంలో చిత్రం భళారే విచిత్రంలో నరేష్.. మేడమ్ లో రాజేంద్ర ప్రసాద్.. ఇలాంటి ప్రయోగాలు చేశారు. రీసెంట్ గా తమిళంలో రెమో అంటూ శివ కార్తికేయన్ అదరగొట్టేశాడు కూడా. ఇప్పుడు మాస్ హీరో అనిపించుకుంటున్న విజయ్ సేతుపతి కూడా ఇలాంటి ఒక పాత్ర చేస్తున్నాడు. "సూపర్ డీలక్స్" అనే మూవీలో విజయ్ సేతుపతి సుదీర్ఘంగా ఉండే పాత్రలో లేడీ గెటప్ లో కనిపించబోతున్నాడు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా ఇచ్చేయగా.. ఈ పాత్ర పేరు శిల్ప అనే సంగతి రివీల్ చేశారు. రెడ్ కలర్ శారీలో.. బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా.. అచ్చు అమ్మాయి మాదిరిగానే కనిపిస్తున్నాడు విజయ్ సేతుపతి. ఎక్కువ మేకప్ లేకుండానే లేడీ గెటప్ లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ భలే ఆశ్చర్యానికి గురి చేసింది.


ఇఫ్పుడీ సినిమా పేరు సూపర్ డీలక్స్ అని అనౌన్స్ చేశారు కానీ.. కొన్ని నెలల ముందు నుంచే ఈ సినిమా అప్ డేట్స్ జనాలకు తెలుసు. అనీతి కథైగళ్ అనే వర్కింగ్ టైటిల్ తెరకెక్కగా.. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఫదా ఫాజిల్.. గాయత్రి కీలక పాత్ర పోషిస్తున్నారు. లేడీ గెటప్ లో ఇప్పటివరకూ చాలామంది హీరోలే ఆకట్టుకున్నారు కానీ.. ఒక ఫుల్ ప్లెడ్జెడ్ మాస్ హీరో ఇలాంటి ప్రయత్నం చేయడం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. ఈ విజయ్ సేతుపతి.. మెగాస్టార్ 151 మూవీ సైరాలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 
Recent Post