ఢిల్లీ టు చెన్నై రకుల్ పరుగులు

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 13, 2017, 11:45 AM
 

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ టైం మాంచి జోరుమీదుంది.  ఓవైపు ప్రెస్టీజియస్ సినిమా రిలీజ్..  మరోవైపు బాలీవుడ్ లో షూటింగ్ తో మేఘాల్లో పరుగులు తీస్తోంది. ఈ ఏడాది ఈ భామ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం.. జయ జానకి నాయక సినిమాలు ఇప్పటికే రిలీజయ్యాయి. ఈ రెండు సినిమాలు ఆమె నటనకు మంచి పేరే తెచ్చిపెట్టాయి. లేటెస్ట్ గా రకుల్ హీరోయిన్ గా.. ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా తెలుగు - తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన స్పైడర్ చిత్రం రిలీజ్ అవడానికి సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కావడం.. రకుల్ ఒక్కతే హీరోయిన్ కావడంతో సినిమా హిట్టయితే ఆటోమేటిగ్గా మరింత పేరొచ్చేస్తుంది.  


ఎప్పుడూ షూటింగులతో బిజీబిజీగా ఉండాలనే తాను కోరుకుంటానని చెప్పే రకుల్ ప్రస్తుతం అలాగే పరుగులు తీస్తోంది. స్పైడర్ షూటింగ్ లో ఫైనల్ గా మిగిలిపోయిన ఓ సాంగ్ షూటింగ్ కోసం ఈమధ్యనే రొమేనియా వెళ్లొచ్చింది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం చెన్నై వెళ్లింది. ఈ ఈవెంట్ పూర్తవగానే సిద్ధార్ధ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న అయ్యారీ సినిమా షూటింగ్ కోసం  ఢిల్లీకి ఎగిరిపోయింది. క్రైం అండ్ ఇన్వెస్టిగేటివ్ పిక్చర్లను ఇంట్రస్టింగ్ గా తీసే నీరజ్ పాండే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మనోజ్ బాజ్ పాయి మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇద్దరు ఆర్మీ ఆఫీసర్ల నిజజీవితంలోని సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు.  


ప్రస్తుతం అయ్యారీ షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. రకుల్ పుట్టి పెరిగింది మొత్తం ఢిల్లీలోనే. ఇప్పుడు సౌత్ టాప్ హీరోయిన్ గా అక్కడ షూటింగు కోసం వెళ్లింది. ఈ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. రకుల్ ఇంతకుముందు హిందీలో యారియా అనే సినిమా చేసింది కానీ దానివల్ల ఆమెకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. ఇప్పుడు అయ్యారీ సినిమాతో బాలీవుడ్ లో క్రేజ్ వస్తుందనే ఆశతో ఉంది. దీంతోపాటు తమిళంలో కార్తి పక్కన తీరన్ అధిగారం ఒండ్రు సినిమాలోనూ రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో రకుల్ కెరీర్ లో తొలిసారి పేద యువతి పాత్ర చేస్తుండటం విశేషం. ఈ అన్నిసినిమాల్లో రకుల్ కు ఏవి ఎంత పేరు తెస్తాయో వేచి చూడాలి మరి. 
Recent Post