జై లవ కుశకు యు/ఎ సర్టిఫికెట్!

  Written by : Suryaa Desk Updated: Wed, Sep 13, 2017, 03:02 PM
 

ఎన్టీఆర్ బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన జై లవ కుశ ఈ నెల 21వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికెట్ ను తెచ్చుకుంది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాత కల్యాణ్ రామ్ స్వయంగా తెలియజేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్లకు .. ట్రైలర్ కు .. ఆడియోకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్కో పాత్రలో ఒక్కో లుక్ తో ఎన్టీఆర్ చేసిన నట విన్యాసాన్ని చూడటానికి అభిమానులంతా ఆసక్తిని చూపుతున్నారు. రాశిఖన్నా  నివేదా థామస్ గ్లామర్ ప్రత్యేక ఆకర్షణ కావడం కూడా వాళ్ల ఆసక్తికి మరో కారణమవుతోంది. ఎన్టీఆర్ కెరియర్లోనే ఈ సినిమాకి ప్రత్యేక స్థానం దక్కుతుందని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎంతమంది హృదయాలను ఎన్ని కోట్లను కొల్లగొడుతుందో.
Recent Post