అర్చన తల్లి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత హరితేజ బంధాలు, అనుబంధాల విషయంలో భావోద్వేగాలకు గురి అయింది. ఆడపిల్ల అంటే ఆఢిపిల్లే అనే వేదాంతానికి గురి అయింది. ఎన్నాళ్లు పెంచినా ఆడపిల్ల ఆడి పిల్లే అని అంటారనే సత్యం అని చెప్పుకొచ్చింది. తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని బాధ కరమైన సంఘటనలను గుర్తు చేసుకొన్నది.
శోభనం రాత్రి మా ఆయన హల్చల్ నాది ప్రేమ వివాహం. మాది సంప్రదాయపరమైన కుటుంబం. చాలా కట్టుబాట్లు ఎక్కువ. అయితే ఇవన్నీ నా భార్తకు పట్టేవి కాదు. నా పెళ్లి తర్వాత పెద్ద గొడవ జరిగింది. శోభనం రోజు రాత్రి గందరగోళం చోటుచేసుకొన్నది. ఆచారం, సంప్రదాయం ప్రకారం జరగాలని మా వైపు పట్టింపు. కానీ ఆయనకు ఇవేమీ కదురవు. ఇంట్లో బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ ఉండగా గొడవ జరిగింది. వారి ముందు సిగ్గు పోయింది అని హరితేజ చెప్పింది.