మహేష్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్పైడర్ చిత్ర ట్రైలర్ కొద్ది గంటల క్రితం విడుదలైంది. ఇప్పటి వరకు కేవలం సాంగ్స్, టీజర్ తోనే అభిమానులని సంతృప్తి పరచిన టీం నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్ విడుదల చేసి అభిమానులలో సరికొత్త ఆనందాన్ని నింపింది. మహేష్ తనదైన స్టైల్ లో అదరగొడితే, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో ఒదిగిపోయింది. ఇక విలన్ పాత్రధారి ఎస్ జే సూర్య ఆకట్టుకున్నాడు. హరీష్ జై రాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది. ప్రతి సీన్ మురుగదాస్ స్టైల్ లో అభిమానులని ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం స్పైడర్ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్ ని షేక్ చేస్తుంది. మరి మీరు ఆ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.