ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జై లవకుశ' నుంచి తమన్నా హాట్ లుక్!

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 15, 2017, 11:02 AM



'జై లవ కుశ'లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ చేసిందనే సంగతి తెలిసిందే. ఈ సాంగ్ ను ఇంకా రిలీజ్ చేయకపోవడంతో, అభిమానుల్లో ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సాంగ్ టీజర్ ను ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ లోగానే ఈ సాంగ్ కి సంబంధించి తమన్నా హాట్ లుక్ ను రిలీజ్ చేశారు.


 ''స్వింగు జరా .. " అంటూ ఈ స్పెషల్ సాంగ్ సాగుతుందని అంటున్నారు.  పోస్టర్ చూస్తే తమన్నా ఒక రేంజ్ లో అందాలు ఆరబోసినట్టు అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన స్పెషల్ సాంగ్స్ లో ఈ సాంగ్ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్ తో కలిసి కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ ఏ రేంజ్ లో అలరించిందో .. అంతకుమించి అనేలా ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని చెప్పుకుంటున్నారు.    






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com