ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో ఇలియానా ముద్దులాట

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2017, 11:16 AM



చాలా మంది హీరోయిన్లు తెరపై ముద్దులతో వార్తల్లోకి వస్తుంటే ఇలియానా నిజ జీవితంలోని ముద్దులతో హడావుడి చేస్తోంది. చాలా మంది హీరోయిన్లు తెరపై హాట్ హాట్ గా దర్శనమిస్తూ వార్తల్లో నిలుస్తుంటే ఇలియానా మాత్రం బాయ్ ఫ్రెండ్ తీస్తున్న హాట్ పిక్స్ తో చర్చలోకి వస్తోంది. ఒక ఆస్ట్రేలియన్ ప్రొఫెషనల్ ఫొటో గ్రాఫర్ తో డేటింగ్ లో ఉంది ఇలియానా. ఈ నేపథ్యంలో అతడు తీస్తున్న తన ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేస్తూ గడుపుతోంది.


ఇదే సమయంలో.. అతడితో ముద్దు ముచ్చట్లకు ఏమీ లోటు రానీయడం లేదు. అందుకు రుజువే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రమ్ లో పోస్టు చేసిన ఈ ఫొటో. ప్రియుడిని చుంభిస్తూ ఫొటో తీయించుకుంది ఇలియానా. మరి ఈ ముచ్చటను తమ మధ్యకే పరిమితం చేయక.. ఇన్ స్టాగ్రమ్ లో పోస్టు చేసి ఇంటర్నెట్ లోకి అప్‌లోడ్ చేసింది.


‘A moment. In a world of madness.’ అనే కామెంట్ తో ఇలియానా ఈ ఫొటోను పోస్టు చేసింది. మరీ క్లోజప్ షాట్ కాకపోయినా.. ఈ ఫొటో చాలా బాగుందని, ఇలియానా నువ్వు చాలా హాట్.. అని ఆమె ఫాలోయర్లు కామెంట్లు పెడుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com