ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్‌గా మారిన సెల్ఫీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 18, 2017, 03:49 PM



తమిళ దర్శకుడు విగ్నేశ్‌ శివాన్‌, కథానాయిక నయనతార ప్రేమలో ఉన్నారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై వీరు ఎప్పుడూ స్పందించలేదు. వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చాలా సందర్భాల్లో వైరల్‌ అయ్యాయి. తాజాగా అలాంటి ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.


విగ్నేశ్‌ సోమవారం తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన బర్త్‌డేని నయనతార న్యూయార్క్‌లో సెలబ్రేట్‌ చేస్తున్నారట. ఈ సందర్భంగా వీరిద్దరు సమీపంలోని బ్రూక్లిన్‌ వంతెన దగ్గర సెల్ఫీ దిగారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


విగ్నేశ్‌ దర్శకుడిగా, రచయితగా, గాయకుడిగా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. నయనతార ఆయన దర్శకత్వం వహించిన ‘నేనూ రౌడీనే’ చిత్రంలో నటించారు. ప్రస్తుతం విగ్నేశ్‌ సూర్య హీరోగా ‘థానా సెర్ధా కూటమ్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నయనతార తెలుగులో బాలకృష్ణ 102, చిరంజీవి 151వ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com