ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మిస్ వరల్డ్ టాప్ మోడల్.. మన పాపే

cinema |  Suryaa Desk  | Published : Wed, Sep 20, 2017, 12:38 PM



ఇండియాలో అందగత్తెలకు కొదువ లేదనే సంగతి చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ అందగత్తెలు సత్తా చాటుతూనే ఉన్నారు. గతంలో మాదిరిగా గదుల్లోను.. గోడల మధ్య తమ అందాలను దాచుకునేందుకు బ్యూటీలు ఏ మాత్రం సిద్ధంగా లేరు. అందుకే మన దేశ అమ్మాయిలకు దక్కే కిరీటాల కౌంట్ పెరుగుతూనే ఉంది. 


లెబనాన్ లో జరిగిన మిస్ వరల్డ్ నెక్ట్స్ టాప్ మోడల్ 2017 పోటీల్లో భారతీయ వనిత ఛార్లెస్ చెరిల్ విజేతగా నిలిచి.. కిరీటం ఎగరేసుకుపోయింది. 49 దేశాలకు చెందిన సుందరీమణులు మిస్ వరల్డ్ నెక్ట్స్ టాప్ మోడల్ టైటిల్ కోసం పోటీ పడగా.. చివరకు మన చెరిల్ కే పట్టం కట్టారు నిర్వాహకులు. నిజానికి ఈ పోటీలో ఆన్ లైన్ లో నిర్వహించిన ఓటింగ్ కు గాను.. చెరిల్ కు 15వ స్థానమే వచ్చింది. అక్కడి నుంచి టాప్ స్టేజ్ కు చేరుకుందంటే.. అదంతా అమ్మడి అందం.. ప్రతిభ మాత్రమే. ఇప్పటివరకూ దక్కించుకున్న టైటిల్స్ లో ఇదే అత్యంత ప్రతిష్టాత్మకం అయినా.. గతంలో కూడా ఈమెకు బ్యూటీ టైటిల్స్ చాలానే దక్కాయి.


మెగా మోడల్ ఫేస్ హంట్ 2009కు విజేత ఛార్లెస్ చెరిల్. క్లారియన్స మిస్ ఇండియన్ దివా 2015 పోటీల్లోనూ టైటిల్ దక్కించుకుంది. అలాగే మిస్ బ్యూటిఫుల్ స్కిన్ మిస్ కంజీనియాలిటీ వంటి ఎన్నో కిరీటాలు ఈమె ఖాతాలో ఉన్నాయి. ఈమె కేవలం అందగత్తె మాత్రమే కాదు.. వ్యాపార ప్రపంచంలో కూడా మంచి గుర్తింపునే సంపాదించుకుంది. అంతే కాదు.. రచయిత్రి.. ప్రొఫెషనల్ డీజే కూడా. ఎన్ లైటెన్ ఇండియా మ్యాగజైన్ కు ఎడిటర్ ఇన్ చీఫ్ గా వ్యవహరించిన ఛార్లెస్.. వార్డ్ రోబ్ కన్సల్టెంట్ కూడా.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com