ముంబై మాఫియా నేపథ్యంలో పా.రంజిత్ తెరకెక్కిస్తున్న చిత్ర కాలా కారికాలన్. ఈ చిత్రంలో రజనీకాంత్ దారవీ ప్రాంతంలోని తమిళుల కోసం పోరాడే కరికాలన్ పాత్రలో కనిపించనున్నాడు. 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్‌లోకి రానుంది. ప్రస్తుతం చెన్నైలో మూవీ షూటింగ్ జరుగుతుండగా, కాలా ఫ్యామిలీకి సంబంధించిన ఓ గ్రూప్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ అతని రీల్ భార్య ఈశ్వరిరావు మధ్యలో కూర్చుండగా, మిగతా సభ్యులు వారి వెనుక నిలుచొని ఫోటోకి ఫోజులు ఇచ్చారు. అభిమానులకి ఈ ఫోటో ఎంతగానో నచ్చింది. రజనీ లుక్ కూడా అదిరిందని చెబుతున్నారు. ఈ సినిమాపై అభిమానులలో భారీ హైప్ తెచ్చేందుకు ఆయా భాషలలోని స్టార్స్‌ని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీ కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటుడు నానా పటేకర్, హిందీ నటి అంజలి పాటిల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తమిళ నటుడు సముతికరని, మలయాళ నటుడు మమ్ముట్టి ముఖ్య పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా వండర్ బార్ ఫిలింస్ పతాకంపై ధనుష్ నిర్మాణంలో రూపొందుతుంది.