ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 08:21 PM



రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా రోజురోజుకు అనూహ్యంగా వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 350 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది.


తాజా అప్‌డేట్ ప్రకారం, కాంతారా విజయవంతమైన రన్ తర్వాత వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ వద్ద 392.75 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.


'కాంతారా' వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
కర్ణాటక - 180.42 కోట్లు
తెలుగు రాష్ట్రాలు- 54.20 కోట్లు
తమిళనాడు -  10.04 కోట్లు
కేరళ - 17.06 కోట్లు
హిందీ+ROI - 100.94 కోట్లు
ఓవర్సీస్ - 30.09 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 392.75 కోట్లు (195.73 కోట్ల షేర్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com