ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలకృష్ణ 'NBK108' టైటిల్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 08:35 PM



టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజగా ఈ చిత్రం హైదరాబాద్‌లో అధికారిక పూజా కార్యక్రమంతో అభిమానుల మధ్య ప్రారంభమైంది.


తాజాగా ఇప్పుడు, ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రానికి టైటిల్‌గా 'బ్రో ఐ డోంట్ కేర్' అనే టైటిల్ ని ఖరారు చేయటానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


ఈ బిగ్గీలో ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. NBK108ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com