ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షూటింగ్‌ పూర్తి చేసుకున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌ 'శబరి'

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 08:43 PM



టాలీవుడ్ అండ్ కోలీవుడ్ లో ఇటీవలి కాలంలో అత్యంత బిజీగా ఉన్న నటీమణులలో వరలక్ష్మి శరత్‌కుమార్ ఒకరు. ఈ గ్లామర్ బ్యూటీ ప్రస్తుతం హను-మాన్ అండ్ NBK107 వంటి తెలుగు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. తాజాగా ఇప్పుడు, అనిల్ కాట్జ్ దర్శకత్వంలో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌పై సంతకం చేసింది. ఈ సినిమాకి 'శబరి' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, సైకలాజికల్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమా ఈరోజు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుంది అని సమాచారం. ఈ చిత్రంలో మైమ్ గోపీ, శశాంక్, సునయన, గణేష్ వెంకట్రామన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. మహా మూవీస్ ఈ సినిమాని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com