ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘దేవుడా! చంపేస్తున్నావ్‌ సమంత’

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2017, 05:07 PM



 ‘ఏమాయ చేసావె’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత అతి కొద్దికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుతెచ్చుకుంది. ఇటు గ్లామర్‌తో పాటు, అటు నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనూ నటిస్తూ మెప్పిస్తోంది. ఎప్పటికప్పుడు విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లిపీటలెక్కబోతోంది. అక్కినేని నాగచైతన్యతో సమంత వివాహం అక్టోబరులో జరగనుంది. హిందూ, క్రిస్టియన్‌ సంప్రదాయంలో జరిగే ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో వివాహానికి కావాల్సిన దుస్తులను సమంత ప్రత్యేకంగా తయారు చేయించుకుంటోంది. ప్రముఖ డిజైనర్‌ క్రేశా బజాజ్‌ వీటిని తయారు చేస్తున్నారు. అద్భుతమైన డిజైన్లతో తయారు చేసిన లెహంగా ధరించి దిగిన ఫొటోలను సమంత ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. కొత్త దుస్తుల్లో మెరిసిపోతున్న సమంతను చూసి అభిమానులు ‘కెవ్వుకేక’ అంటున్నారు. కొందరైతే ‘దేవుడా! చంపేస్తున్నావ్‌ సమంత’ అంటుంటే ‘సౌత్‌ఇండియా కరీనాకపూర్‌’ అంటూ ఇంకొందరు కామెంట్లతో పొగిడేస్తున్నారు. అంతేకాదు ఆమెను నటన నుంచి ఏవీ దూరం చేయలేవంటూ పేర్కొంటున్నారు.


సమంత త్వరలో ‘రాజుగారిగది 2’ చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓంకార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీనితో పాటు రామ్‌చరణ్‌-సుకుమార్‌ల కలయికలో వస్తున్న ‘రంగస్థలం 1995’ చిత్రంలో కూడా శామ్‌ నటిస్తున్నారు. గతంలో ఎన్నడూ చేయని పాత్రలో సమంత ఈ సినిమాంలో కన్పించనుందట. ఆమె వేషధారణ కూడా ప్రత్యేకంగా ఉంటుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com