ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేను అని సూర్య అంటారు.. అతడే అని నేను చెబుతుంటాను

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 21, 2017, 06:26 PM



సినీ రంగంలో పని చేస్తూ, సినీరంగంలోని వ్యక్తినే ప్రేమించి, పెళ్లి చేసుకున్న వారెంతో మంది ఉన్నారు. అలాంటి వారిలోని ఒక జంట సూర్య-జ్యోతిక. పలు సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించిన వీళ్లిద్దరూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దశాబ్దంపై నుంచే వివాహబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వివాహం, పిల్లలు.. తర్వాత జ్యోతిక ఈ మధ్య తిరిగి నటిగా తన ప్రస్థానాన్ని తిరిగి మొదలుపెట్టింది. ప్రధానంగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తోంది.


ఈ క్రమంలో తన తాజా చిత్రప్రమోషన్ లో ఉన్న జ్యోతిక.. ట్విటర్ లో తన ఫాలోయర్లతో ముచ్చటించింది. ఈ నేపథ్యంలో జ్యోతిక ట్విటర్ ఫాలోయర్లు.. జ్యోతిక ప్రేమకథ గురించి ఆరా తీశారు. సూర్యను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు కదా, మీలో ఎవరు ముందుగా ప్రేమ ప్రతిపాదన చేశారు.. అనే ప్రశ్నను అడిగారు నెటిజన్లు. దీనికి జ్యోతిక ఆసక్తిదాయయమైన సమాధానం ఇచ్చింది.


తమది ప్రేమ వివాహమే అని, వివాహానికి చాలా ముందు నుంచినే కలిసి ప్రయాణించమాని జ్యోతిక చెప్పింది. మరి ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారంటే...‘నేను అని సూర్య అంటారు. అయితే అతడే అని నేను చెబుతుంటాను..’ అని చమత్కరించింది. ‘కానీ.. ముందుగా ఎవరు ప్రపోజ్ చేశామో.. మరిచిపోయాం..’ అని జ్యోతిక చెప్పింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com