ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీరి ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో చాలా వైరల్

cinema |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2017, 01:14 PM



టాలీవుడ్ లో సాధరణంగా హీరోయిన్స్ వెండితెరపై కనిపించడం చూస్తూనే ఉంటాం. ఒకే తెరపై కనిపించినప్పుడు ముద్దగుమ్మలు అందాలతో ఎవరి స్థాయిలో వారు పోటీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎక్కువాగా కలిసి వర్క్ చేస్తున్నారు. ఫ్రెండ్లిగా ఉంటున్నా వారి మధ్య ఈగో ఉంటుందని సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది. ఏ అమ్మాయైనా తనకంటే ఇంకొకరు అందంగా ఉన్నారంటే గట్టిగా ఒప్పుకోలేదు. పైకి ఎదో చెప్పినా కాస్త లోలోపల ఎదో ఉంటుంది. మరి హీరోయిన్స్ విషయంలో ఆలాంటి ఓ సందర్భం ఏర్పడితే ఎలా ఉంటుంది?


రీసెంట్ గా ఇదే తరహాలో టాలీవుడ్ హీరోయిన్స్ కి  సోషల్ మీడియాలో చిన్న సంభాషణ జరిగింది. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజల్ ఎంత అందంగా ఉంటుందో తెలిసిన విషయమే.. సినిమాల్లోకి అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తున్నా తన అందంతో ప్రస్తుత హీరోయిన్లకు పోటీని ఇస్తోంది. అయితే రీసెంట్ ట్విట్టర్ ఒక అభిమాని "కృష్ణగాడి వీర ప్రేమ గాధ" హీరోయిన్ మెహ్రిన్ పిర్జాద ని కాజల్ తో పోల్చాడు. మెహ్రిన్ ని చూస్తుంటే.. కాజల్ లా అందంగా ఉందని వారి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయని కామెంట్ చేశాడు. 


అయితే మెహ్రిన్ ఆందుకు చాలా స్వీట్ గా కౌంటర్ వేసింది. తనకన్నా చాలా అందమైన హీరోయిన్ అని ఇప్పటికే చాలా పాపులర్ అయ్యారని చెప్పింది. దీంతో కాజల్ కూడా ఈ విషయంపై స్పదించింది. మెహ్రిన్ ఆల్ రెడీ చాలా బ్యూటిఫుల్ అంటూ తనదైన శైలిలో పొగిడింది. అందుకు మెహ్రిన్ చాలా సంబరపడిపోయింది. మీ పై నాకు ఎప్పటికి క్రష్ ఉంటుందని కామెంట్ చేసి మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం వీరి ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి.      






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com