బాలీవుడ్ లో వారసుల రంగ ప్రవేశం అన్నది కొత్తేం కాదు. సినిమా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న వారి సంతానంలో చాలామంది ఇండస్ట్రీలో తమ టాలెంట్ నిరూపించుకునేందుకు సినిమాల్లోకి అడుగు పెట్టారు. ఈమధ్య సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేనివారి సంతానం కూడా బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకోవాలని ఆరాట పడుతోంది. తాజాగా ఈ జాబితాలో క్రికెట్ ఆటతో దేశం మొత్తం అభిమానులను సంపాదించుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కుమార్తె చేరింది.
సచిన్ టెండుల్కర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్పటి నుంచి తన పిల్లల కెరీర్ పైనే ఫోకస్ పెట్టాడు. కుమారుడు అర్జున్ తండ్రి బాటలోనే క్రికెట్ పైనే కాన్సన్ ట్రేట్ చేశాడు. కుమార్తె సారా మాత్రం వెండితెరపై వెలిగిపోవాలని ఆశపడుతోంది. ఆమె కోరికకు తండ్రి సచిన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాల్లో ఎంట్రీకి కావలసిన టాలెంట్ పెంచుకునే పనిలో పడింది. ప్రస్తుతం నటనలో ట్రైనింగ్ తీసుకుంటోంది. అన్ని అంశాల్లోనూ ట్రైనింగ్ అయ్యాక ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఆమెను ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం హిందీలోని యంగ్ హీరోల్లో టాప్ పొజిషన్ లో ఉన్నవారి పక్కన ఆమె నటించే ఛాన్స్ ఉంది.
సినిమా పరిశ్రమ ఎప్పుడూ కొత్తందాలకు ఆహ్వానం పలుకుతుంది. ఎలాగూ తండ్రి సచిన్ కున్న ఇమేజ్ ఆమెను లాంచ్ చేయడానికి సరిపోతుంది. బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాశ్ పదుకొనే కుమార్తె దీపికా పదుకొనే సినిమాల్లోకి వచ్చి టాప్ హీరోయిన్ రేంజికి చేరుకుంది. సారా కూడా క్లిక్కయితే స్పోర్ట్స్ పర్సన్ ఫ్యామిలీ నుంచి పైకెదిగిన మరో హీరోయిన్ అవుతుంది.