టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'స్పైడర్' మూవీ సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. ఇటు తెలుగునాడు, అటు తమిళనాడు రెండు రాష్ట్రాలు కవర్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. తొలిసారిగా ఆయన తమిళంలో సినిమా చేసిన నేపథ్యంలో అక్కడి మార్కెట్ మీద, ప్రేక్షకుల మీద ఫోకస్ పెట్టారు. హీరోయిన్ రకుల్, దర్శకుడు మురుగదాస్, ఎస్జే సూర్య, భరత్, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, లైకా ప్రొడక్షన్స్ సీఈఓ రాజుమహాలింగం, సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.గతంలో ఏ సినిమాకు పడనంత టెన్షన్ ఈ సినిమాకు మహేష్ బాబు పడుతున్నారు. సినిమా విడుదల దగ్గర కావడంతో వారం రోజుల నుండి సరిగా నిద్రపట్టడం లేదని, హార్ట్ బీట్ కూడా పెరిగిందిన మహేష్ బాబు వెల్లడించారు.
నా కెరీర్లో ప్రతిష్టాత్మక సినిమా మురుగదాస్ దర్శకత్వంలో నటించడం నా కెరీర్లోనే ప్రతిష్టాత్మకం. నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు సపోర్టు చేయడం వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ సాధ్యమైంది. లైకా వంటి భారీ సంస్థ తమిళ వెర్షన్ పంపిణీ చేయడం సంతోషంగా ఉందని మహేష్ బాబు అన్నారు.తెలుగు, తమిళం తెలిసిన నాకే షూటింగ్ సమయంలో చాలా కష్టం అనిపించింది. ఈ రెండు బాషలు సరిగా తెలియని రకుల్ ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు.... అని హీరోయిన్ గురించి మహేష్ బాబు వ్యాఖ్యానించారు.