ట్రెండింగ్
Epaper    English    தமிழ்

I L U’ మధు.. బిగ్‌బాస్ టైటిల్ గెలుస్తా అనుకోలేదు

cinema |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2017, 03:10 PM



‘నేను విజేతగా నిలుస్తానని అనుకోలేదు. బిగ్‌బాస్ సీజన్ 1 నుంచి మధ్యలో వెళ్లిపోతానని అనుకున్నాను’ అన్నారు టైటిల్ విన్నర్ శివబాలాజీ. తెలుగు టెలివిజన్ చరిత్రలోను ది బిగ్గెస్ట్ రియాలిటీ షోగా జూలై 16న ప్రారంభమై 71 రోజుల పాటు తెలుగుప్రేక్షకులను ఆకట్టుకున్న బిగ్ బాస్ సీజన్ 1 ఆదివారం రాత్రి(సెప్టెంబర్ 24) తో ముగిసింది. ఈ గ్రాండ్ ఫినాలోలో శివబాలాజీ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. తనను విన్నర్‌గా ప్రకటిస్తారని ఊహించలేదని భావోద్వేగానికి గురయ్యారు శివబాలాజీ.


నాతోటి కంటెస్టెంట్స్ వల్లే నేను బిగ్ బాస్ హౌస్‌లో ఇన్నాళ్లు ఉండగలిగాను. నిజం చెప్పాలంటే వాళ్ల వల్లే టైటిల్ గెలవగలిగాను. ఆడియన్స్ నుండి నాకు ఇంత సపోర్ట్ వస్తుందని ఊహించలేదు. నాకు ఓట్ చేసి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గెలిపొందేలా చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థ్యాంక్యూ సో మచ్” అంటూ తన ఆనందం వ్యక్తం చేశాడు శివబాలాజీ.


ఎన్టీఆర్ బిగ్ బాస్ తొలి సీజన్ విన్నర్‌గా శివబాలాజీ పేరును ప్రకటించగానే.. తన ఆనందాన్ని స్టేజ్ దగ్గర ఉన్న తన భార్య, పిల్లలు, కుటుంబ దగ్గరకు పరుగున వెళ్లి వారితో పంచుకున్నారు శివబాలాజీ. ఈసందర్భంగా.. మీరు ఐ లవ్ యు ఎవరికి చెప్పాలనుకుంటున్నారని ఎన్టీఆర్ శివబాలాజీని అడగగా.. ‘హండ్రెట్ పర్సెంట్ తన భార్య మధుకే' అంటూ శివ బాలాజీ స్పష్టం చేశారు.


ఇక ఫైనల్ పోరులో శివబాలాజీకి గట్టిపోటీ ఇచ్చిన ఆదర్శ్ కేవలం 8 లక్షల ఓట్లు తక్కువగా రావడంతో రన్నర్‌తో సరిపెట్టుకున్నాడు. పోలైన 11 కోట్ల 90 లక్షల ఓట్లలో టైటిల్ విన్నర్ శివబాలాజీకి 3 కోట్ల 34 లక్షల ఓట్లు రావడం విశేషం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com