ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీక్వెల్ కి రెడీ కాబోతున్న'మన్మధుడు'

cinema |  Suryaa Desk  | Published : Sun, Jan 20, 2019, 06:58 PM



అక్కినేని నాగార్జున కెరీర్లోని ఉత్తమ చిత్రాల్లో విజయ భాస్కర్ తెరకెక్కించిన 'మన్మథుడు' ఒకటి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను దక్కించుకున్న నాగార్జునకు 'మన్మథుడు' చిత్రం ఎప్పటికి మర్చిపోలేని విజయాన్ని తెచ్చి పెట్టింది. ఈ మూవీతోనే నాగార్జున తెలుగు ప్రజల గుండెల్లో మన్మథుడిగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ హిట్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రూపొందనుంది. 'చి.ల.సౌ' చిత్రంతో దర్శకుడిగా డీసెంట్ సక్సెస్ ను దక్కించుకున్న రాహుల్ రవీంద్రన్ తన రెండవ సినిమాగా 'మన్మథుడు 2'ను చేయడం దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి నాగ్ కు వినిపించడం, నాగార్జున కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జున మీడియం బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు. నాగార్జున సైతం ఈ సినిమాపై చాలా ఆసక్తిగా ఉన్నారట. 'మన్మథుడు 2' చిత్రంతో పాటే నాగార్జున 'బంగార్రాజు' చిత్రాన్ని కూడా చేయబోతున్నాడు. నాగచైతన్యతో కలిసి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రంలో నటించబోతున్నాడు. ఈ చిత్రం లో నాగర్జున తాతగా అయన మనవడిగా నాగచైతన్య నటిస్తున్నారని టాలీవుడ్ టాక్. మరి నాగార్జున 'మన్మధుడు 2' లో ఎలా కనిపిస్తాడో చూడాలి.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com