ప్రపంచవ్యాప్తంగా నిన్న విడుదలైన విశ్వక్ సేన్ కొత్త చిత్రం "దాస్ కా ధమ్కీ" కి అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇక్కడే కాదు, ఓవర్సీస్ లోనూ ధమ్కీ మూవీ కలెక్షన్లతో ఇరగదీస్తోంది. వరల్డ్ వైడ్ గా తొలి రోజు 8.88 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా విశ్వక్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ఫస్ట్ డే గ్రాసర్ గా నిలిచింది.
తాజా సమాచార ప్రకారం, నైజాం ఏరియాలో ధమ్కీ కలెక్షన్లు దుమ్ము రేపుతున్నాయని తెలుస్తుంది. నైజాంలో తొలి రోజు 2.7 కోట్ల గ్రాస్, సుమారు 1.42 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. తొలి రోజు ఇంత షేర్ అంటే నిజంగా ఔట్ స్టాండింగ్. మరి, మున్ముందు రోజుల్లో ధమ్కీ కలెక్షన్ల భిభత్సం ఎలా ఉంటుందో చూడాలి.